Do GOD allow curse when Man curse? Do GOD bless when Man bless?
నిజాముగా ఒక మనిషి దీవిస్తే మనుషులు దీవించబడతారా ? అలాగే ఒక మనిషి శపిస్తే వారు శపింప బడతరా? అవును అనే బైబుల్ చెబుతుంది. బైబుల్ (Numbers 22:1-6 సంఖ్యకాండము 22: 1-6)నుండి ఒక గొప్ప సత్యాన్ని మనం తెలిసుకోబోతున్నాము. ఇక చదవండి ......
ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయులు మోషే (Moses) నాయకత్యం లో బానిసత్వము నుండి విడిపించబడి అనేక ప్రాంతాలు దాటుకుంటూ యోర్దాను ఎదురుగా ఉన్న మోయాబు ప్రాంతం లో దిగిరి. ఇశ్రాయేలీయులు బహు విస్తారముగా మోయాబు ప్రాంతం లో కూడియున్నారు అని విన్న అప్పటి మోయాబీయుల రాజు అయిన సిప్పోరు (zippor) కుమారుడు అయిన బాలాకుకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అది ఏమిటింటే ఇంతకమునుపు ఇశ్రాయేలీయులు (Israel)అమ్మోరీయులకు చేసినది. అయితేఇశ్రాయేలీయులు అమ్మోరీయులకు ఏమిచేసారు ?
అప్పటి అమ్మోరీయుల రాజు అయిన సీహొనుకు ఇశ్రాయేలీయులు ఇలా మనవి చేసుకున్నారు " మా దేవుడు మాకు యిచ్చిన వాగ్ధాన దేశము అయిన కనాను కు మేము వెళ్లటానికి మీ దేశము యొక్క రాజ మార్గముగుండా అనుమతి యిచ్చినచో మీ ద్రాక్ష తోటలను, మంచినీటి బావులను, పొలములను వీటి వేటిని మేము ముట్టము మరియు యుద్ధము కూడా చేయము" అని కబురుచేసిరి. అది నమ్మని రాజు మా మార్గాముగుండా వెళ్ళ నీయము అని తన సైన్యముతో యుద్ధమునకు సిద్ధపడి ఇశ్రాయేలీయులులతో యుద్ధము చేసిరి. అయితే ఆయుద్ధములో దేవుడు ఇశ్రాయేలీయులులకు విజయము యిచ్చాడు. ఇశ్రాయేలీయులు యొక్క ఉద్దేశ్యము దేవుని ఉద్దేశ్యం కాని ఆ ఉద్దేశ్యమునకు కూడా ఒక అభ్యంతరం కలిగింది. నిజ జీవితములో క్రైస్తవులు అయిన మనకు కూడా మంచి ఉద్దేశములకు అభ్యంతరం కలుగవచ్చు. మంచి ఉద్దేశ్యములను అర్ధం చేసుకొనే స్వభావము అవతల వ్యక్తులకు లేనప్పుడు యుద్దాలు జరుగుతూ ఉంటాయి. ఒక మంచి ఉద్దేశ్యం నెరవేర్చే క్రమం లో మన కుటుంబాలలో కూడా ఇలాంటి యుద్దాలు జరుగుతుయుంటాయి. భార్య మాట భర్త కు అర్ధం కాదు, భర్త మాట భార్య కు అర్ధం కాదు, తల్లి మాట పిల్ల కు అర్ధం కాదు, పిల్ల మాట తల్లికి అర్ధం కాదు. ఇలా అనేక విధాలుగా నిత్యం మన కుటుంబాలలో చాలా యుద్దాలు జరుగుతూయుంటాయి. అయినప్పటికి మనము ఎంతమాత్రము మన ఉద్దేశ్యములను విడిచిపెట్టకూడదు. ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు ఉండి శత్రువు మీద వారికి విజయమును యిచ్చాడు ఎందుకు అంటే ఆ ఉద్దేశ్యం దేవునిదే. అందుకనే మనమందరము కూడా మంచి ఉద్దేశ్యములను కలిగి మన ఆత్మీయ జీవితాలను కొనసాగించాలి. మంచి ఉద్దేశ్యములకు ఆటంకాలు ఎనో వస్తాయి కాని ఎప్పటికి అపజయాలు ఉండవు.
ఇశ్రాయేలీయులకు శత్రువులయిన అమ్మోరీయుల మీద దేవుడు ఇచ్చిన గొప్ప విజయం తరువాత వారు మోయబు మైదానముకు వచ్చారు. మోయాబీయుల రాజైన బాలాకు ఇశ్రాయేలీయులీలు అమ్మోరీయులకు చేసిన దానిని విని దానినిబట్టి కలవరం చెందినట్టుగా బైబిల్ లో చూస్తాము. అయితే ఇశ్రాయేలీయులను చూచిన మోయాబీయుల రాజైన బాలాకు భయము కలగటమే కాకుండా జుంకు పుట్టినట్లు మరియు మిక్కిలి భయపడినట్లు మనము వాక్యభాగంలో చూస్తాము. ఇది ఎవరివలన కలిగింది? శత్రువు వలన? నిజాముగా మనకందరికి శత్రువు ఎవరు ? ఒకే ఒక్కడు వాడి పేరే అపవాది. అపవాది మనకందరికి శత్రువు. ఈ లోకం లో ఎవరు ఎవరికి శత్రువు కారు. మనకందరికి ఉమ్మడి శత్రువు అపవాది మాత్రమే అని మనం గమనిచాలి. అయితే అన్ని సమస్యలకు మూలము వాడే అని మనం మర్చిపోకూడదు . అయితే ఒక్కొకసారి వాడే నీ ముందుకు వచ్చి ఈ సమస్యలని పెడతాడు. ఈ అపవాది పెట్టిన సమస్యకు ఆనాడు మోయబు రాజు కూడా మిక్కిలి భయపడ్డాడు. ఉదాహరణకు ఒక సమస్యను తీసుకుందాం, అది పక్షవాయువు అనే అనారోగ్య సమస్యనే తీసుకుందాము. పక్షవాతమే వచ్చింది అంటే ఆ అనారోగ్యాన్ని అపవాది నీ ముందుకు తెచ్చాడు అని అర్ధం. అది చూడగానే మనిషికి ఏమవుతుంది? విపరీతమైన భయం కలుగుతుంది మొన్నటి వరకు బాగానే నడిచాను, బాగానే తిరిగాను ఇప్పుడు తిరగలేక పోతున్నాను అని ఆలోచిస్తాడు. ఈ ఆలోచనలో విపరీతమైన భయము కలుగుతుంది. ఈ భయములో మనిషి విపరీతమైన ఆలోచన చేస్తాడు ఈ ఆలోచనల నుండి క్రమంగా జంకు మొదలు అవుతుంది. జంకటము అంటే ఏమిటి ? ఇదివరకు నీవు చాలా చక్కగా పుష్టిగా ఉన్నావు అయితే ఇప్పుడు నీవు చాలా సన్నగా ఉన్నావు మరియు బాగా చిక్కిపోయావు అనే భయం వల్ల కలిగినదాన్ని జంకటము అని అంటారు. ఎవరైతే శారీరకంగాను, మానసికంగా కూడా బలహీన పడతారో వారు జంకిన పరిస్థితిలోనికి వెళ్లారు అని అర్ధం. యే క్రైస్తవ సహొదరుడు కాని, యే క్రైస్తవ సహొదరి కాని అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశ్యం.
ఎద్దు పచ్చగడ్డిని తినటం ఎంత సులభమో, శత్రువులు అయిన ఈ ఇశ్రాయేలీయులీలు మనలను జయించటం అంతే సులభము అని మోయబు రాజు ఎరిగి భయపడుతున్నాడు. మనిషి జంకినప్పుడు ఏ విధముగా బలహీనముగా మాట్లాడుతాడో జంకినస్థితిలో ఉన్న మోయబు రాజు కూడా తనకు కలిగిన భయమును బట్టి అలాగే మాట్లాడుతునాడు. ఇక్కడ మోయాబు రాజు అనుమానంతో "నేను బలము పొందుదునేమో అని అంటున్నాడు కాని నేను బలము పొందుతాను" అని నమ్మకంతో మాత్రం అనటం లేదు. ఎందుకంటే అతనిలో ఒక్క అద్భుతమైన సందేహము, ఒక్క అల్ప విశ్వాసము ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఏ మనిషి కుడా ఏ విషయాని నమ్మడు. జంకే స్థితిలో ఉంటే మనము కూడా దేవుని మాటను నమ్మలేము. నీవు ఆలోచించి నీ ఎత్తు మూరెడు ఎత్తు చేసుకోగలవా అని అన్నారు ప్రభువు. అంటే నీవు ఎంత ఆలోచించిన నీవు నీ ఎత్తు మూరెడు ఎత్తు చేసుకోలేవు కాబట్టి ఆ విదముగా ఆలోచన చేస్తే నీవు కూడా దేవుని మాటలను నమ్మలేవు. అప్పుడు నీవు అల్పవిశ్వాసివిగా మారుతావు. కాబట్టి మనము ఒక అలవాటు చేసుకోవాలి అది ఏమిటి అంటే ఏ సమస్యైనను, ఏ ఆటంకమైనను, మన ముందుకు వచినప్పుడు మనం ప్రభువు మీద భారం వేయటమే మనం నేర్చుకోవాలి అదే అలవాటు చేసుకోవాలి. నా భారము యెహొవా మీద మోపుతున్నాను, నేను నిశ్చింతగా ఉంటాను, నేను దేనికి భయపడను అని నీవు విశ్వాసించాలి.
ఇలాంటి స్థితిలో ఉన్న బాలాకు ఒక్క వ్యక్తి గురించి విన్నాడు అతనే బిలాము. బిలాము ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు అని, అతను ఎవరిని శపిస్తే వారు శపించబడతారు అనే విషయం విని బిలామును తన దగ్గరకు తెమ్మని మనుష్యులను ఆజ్ఞా పించాడు. మనకు తెలియనిది బైబిల్ చెప్పే సత్యం ఏమిటి అంటే " ఒక (అభిషేకం పొందిన)మనిషి దీవిస్తే వాళ్ళు దీవించబడతారు అని, ఒక (అభిషేకం పొందిన) మనిషి ఎవరిని శపిస్తే వారు శపించబడతారు అని. అవును ఇది నిజం.
ఎలిషా అనే ప్రవక్త బెతేలు అను ప్రాంతమునకు వెళ్ళుతున్నప్పుడు కొంతమంది పిల్లలు ఆయనను చూచి "బోడి వాడా " అని హేళన చేస్తారు. ఆ మాట లకు ఎలీషా కోపగించి వారిని యెహోవా నామమున శపిస్తాడు. అప్పుడు రెండు ఆడ ఎలుగుబంటులు అరణ్యం నుండి వచ్చి 42 మంది బాలురను చంపివేసినట్టు చూస్తాము (II రాజులు 2:23 - 24 ). గమనించండి ఒక (అభిషేకం పొందిన) మనిషి శపిస్తే జరిగింది. అలాగే ఒక (అభిషేకం పొందిన) మనిషి దీవిస్తే కూడా దీవెన కలుగుతుంది. అది కూడ బైబిల్ లో చూస్తాము.
ఎల్కానా భార్య అయిన హన్నా కి నంతానము కలుగక పోవటాన్ని బట్టి దేవుని సన్నిది లో అంగలార్చుచుండగా, దేవుని యాజకుడు అయిన ఏలీ (Eli) ఆమెను చూచి (I సమూయేలు 1: 17-18) Then Eli answered and said " Go in peace, and the GOD of Israel grant your petition which you have asked of HIM" నీవు క్షేమముగా వెళ్ళుము ఇశ్రాయేలు దేవునితో నీను చేసుకొనిన మనవిని అయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా" ఆ మాటలు హన్నా నమ్మగా ఆమెకు ఒక బాలుడు (సమూయేలు) పుట్టినట్టు మనం చూస్తాము. నిజ జీవితం లో మనం కూడా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నేను అడిగింది యిస్తాడు అని ఆశ కలిగి రావాలి. అప్పుడే దాన్ని మనం పొందుకుంటాము. దైవజనుడు ప్రార్ధించగా హన్నా దానిని నమ్మగా అప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగినట్లు చూసాము. ఇక్కడ ఒక విషయం మనం గమనిచాలి, అది ఏమిటి అంటే "నీకు పిల్లలు పుడుతారు అని " ఎవరు చెప్పారు? దేవుడా ? లేక దైవజనుడా?. హన్నా దైవజనుడు చెప్పిన దానిని నమ్మింది. అసలు విషయానికి వస్తే దీనిని బట్టి మనకు తెలిసేది, ఒక మనిషి దీవిస్తే దీవెన వస్తుంది, శపిస్తే శాపం వస్తుంది అని. శపిస్తే శాపం రావటానికి, దీవిస్తే దీవెన రావటానికి ఆ మనిషి ఎంత ఆత్మీయ స్థితిలో ఎదిగి ఉండాలో ఇప్పుడు మనము బిలాము జీవితము నుండి నేర్చుకుందాము. ఉదాహరణకు ఎదుటి వారి మాటల్లో, చూపుల్లొ, ఆలోచనల్లో ఏ దురుద్దేశం లేనట్టు ఉంటుంది. కాని దేవుడు వారి మాటల వెనుక ఉద్దేశ్యాన్ని, చూపుల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని, ఆలోచనల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని చూస్తాడు. అలాంటి చిన్న విషయాలలో కూడా తొలిగిపోనీ మనిషి సంపూర్ణమైన ఆత్మీయ స్థితిలో ఉన్న మనిషి దీవిస్తే దీవెన వస్తుంది, శపిస్తే శాపం వస్తుంది. చేసిన ప్రతి తప్పును దేవుని ఎదుట ఒప్పుకొని యదార్ధ మైన స్థితిలో ఎవరు ఉంటారో వారు దేవునికి చాల దగ్గరగా ఉంటారు. నీవు ఎంత యదార్ధముగ ఉంటావో దేవుని ఎదుట మనం అంత బలంగా ఉంటాము. అలాంటి యదార్ధ మైన స్థితిలో ఎవరు ఉంటారో వారితో దేవుడు మాటలాడటం చేస్తారు. యదార్ధ మైన స్థితిలో స్థిరముగా ఎవరు ఉంటారో వారితో దీవుడు జరగబోయేది కూడా ముందుగ తెలియ చేస్తారు. ఎవరు అయితే ఇలాంటి ఆత్మీయ స్థితిలో స్టిర పరచబడి ఉంటారో వారితో దేవుడు, దేవునితో వారు ఒకరితో ఒకరు మమేకమై ఉంటారు. అలంటి ఉన్నతమైన స్టితిలో నిలిచి, కొనసాగించబడుతున్న వ్యక్తులు ఏమైనా అనగా ఆ మాటలను దేవుడు స్థిరపరుస్తాడు. ఇక్కడ మనం చూస్తున్న బిలాము కూడా అలాంటి స్టితిలో ఉన్న వ్యక్తి అన్నమాట.
బిలాము దగ్గరకు వచ్చిన మనుష్యులు సోదె సొమ్మును బిలాముకు ఇవ్వజూపగ దానిని బిలాము అంగీకరంచలేదు. అయితే వారు అడిగిన దానిని బట్టి దేవుని దగ్గర బిలాము ప్రార్దించగా దేవుడు బిలామునును ఒక ప్రశ్న అడుగుతారు. అదేమిటి అంటీ " నీ దగ్గరకు వచ్చిన వారు ఎవరు అని ". నిజముగా దీవునికి తెలియక బిలాముని అడిగారా? లేదు. కాని కొన్ని సార్లు నీ మనసులో ఉన్న ఉద్దే శ్యాన్ని తెలుసుకుంటానికి అలా అడుగు తారు. ఇలాంటి సందర్భాలు బైబిల్ లో చాల సార్లు చూస్తాము. ఎలియా లాంటి ప్రవక్త ను కూడా అడిగినట్లు చూస్తాము. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు, వారు ఆశీర్వదించ బడిన వారు, నీవు వారిని శపించదానికి వెల్లకూడదు అని చెప్పి నప్పడు, బిలాము ఆ సంగతిని బలాకు మనుష్యులకు చెప్పి వారిని పంపించివీసినట్టు చూస్తాము. అయితే బాలకు ఈసారి ఆధికారులను, పెద్దలను మరియు మరింత ఎక్కువ ధనమును ఇచ్చి బిలాము వద్దకు పంపి మీకు మరింత ఘనతను మా రాజు కలుగ చేస్తారు అని చెప్పినప్పుడు దానినిబట్టి బిలాము మనసునందు ఆశపడి వారిని బట్టి దేవుని దగ్గర ఈసారి యెహోవా ఇకనేమి మాటలాడునో తెలుసుకుంటాను అని వారితో చెప్పి దేవుని యొద్దకు విచారింపవెళ్ళెను. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనిచాలి. అది ఏమిటంటె ఒకసారి వద్దు అన్న దేవుడు మనసు మార్చుకొని రెండొవమారు వెళ్ళమంటారా?. ఒక సారి మాటలాడి వెనుకకు మాట తీసుకోవటం దేవుని స్వభావమా? కానే కాదుగదా? ఐతే బాలాకు ఇచ్చే ఘనతను ఆశించిన బిలాము యొక్క ఉద్దేశ్యాన్ని దేవుడు గమనిచారు. సంఖ్యా: 22: 20 లో చెప్పబడినట్లు "నేవు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలను " అని దేవుడు బిలాము తో సెలవిచ్చెను. తెల్లవారుజామున గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రాగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. దవుడు చేయ వద్దు అని ఒక సారి చెప్తే దానిని నీవు చేయాలి అని పదే పదే తలిస్తే నీ ఆశ చొప్పున దేవుడు దానిని జరిగించు అని చెప్తారు. నీకు ఇచిన స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం సరిగా చేసికోనప్పుడు దేవుని ఉగ్రత నీ మీదకు దిగి వస్తుంది. ఇక్కడ బిలాము కూడా అలంటి ఉగ్రతనే చూస్తున్నాడు. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసెను గనుక అది త్రోవను విడిచి పొలము లోకి పోయెను. బిలము గాడిదను దారికి మలుపవలెనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్షా తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడ కు అదిమెను గనుక ఆతను మరల దాన్ని కొట్టెను. అది ఎందుకు బిలాము కాలును గోడకు అదిమిందో బిలాము గమనిచలేదు. ఎందుకు కాలును గోడకు అడిమిందో తెలుసా? కాలు మన క్రియలకు సూచన. గాడిద బిలాముకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసినా బాలకు అది గమనించలేదు. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమ కైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోట నిలువగా గాడిద యెహోవా దూతను చూసి బిలాము తో కూడా క్రింద కూలబడెను. గనుక బిలాము కి కోపముమండి తన చేతి కర్రతో మరల దాన్ని కొట్టెను. గాడిదకే దీవుని దూత కనబడుట, బిలాముకు కనబడక పోవుట ఇక్కడ ఆసక్తికరమైన సంగతి. ఒక్క ఉద్దేశ్యమే మనలో సరిఅయినదిగా లేనప్పుడు దేవుడు మనకు మరుగు చేయబడతారు. అప్పుడు యెహోవ ఆ గాడిదకు మాటలను ఇచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టిటివి, నేను నిన్ను ఏమి చేసితిని? అని బిలాము తో అనగా, నీవు నా మీద తిరుగాబదితివి అని అనగా, గాడిద " నేను నీదగ్గర ఉన్నది మొదలుకొని ఎప్పుడుఅయిన ఇలా చేసితినా?" అని అడుగగా లేదు అనెను . అంతట యెహోవ బిలాము కన్నులు తెరిచెను గనుక త్రోవలో నిలిచిన యెహోవ దూత ను అతను చూసెను. ఇక్కడ గాడిద బిలాముకు మేలు చేసి అది కీడును పొందుకొని, అది మాటలాడుట ద్వారా మనిషితో సమానము గాను మరియు తన క్రియలను చూపుట ద్వారా మనిషికన్నా ఘనమైనదిగా ఎంచబడింది. అందుకు బిలాము " నేను పాపము చేసితిని నీవు నాకు త్రోవలో నిలిచినది నాకు తెలిసినది కాదు. కాబట్టి నీ దృష్టికి చెడ్డది అయితే నేను వెనుకకు వెళ్ళేదను" అని యెహోవా దూత తో చెప్పెను. చివరకు బిలాము దేవుని ప్రజలను దీవించి బాలాకును శపించినట్లు బైబిల్ తెలియచేసింది . బిలామువలె మనం కూడా అన్నిటిని ఒప్పుకొంటె మన మాటలను కూడా దేవుడు స్థిరపరుస్తారు. ఆమెన్ !!!